సిట్రా బాంబు దాడి కేసులో ఐదుగురి అరెస్టు
- August 14, 2015
గత నెల బహ్రైన్ లోని సిట్రాలో ఇద్దరు పోలీ స్ వారి మృతికి, 5గురు ఇతరుల గాయాలకు కారణమైన బాంబుదాడి కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్టు ఆ దేశ ఆంతరంగిక శాఖ వారు నిన్న ప్రకటించారు. అరెస్టు చేయబడిన వారిలో ముగ్గురు ఇరాన్ రేవల్యూషనరీ గార్డ్స్ మరియు ఇరాక్ కు చెందిన హిజ్బొల్లా గ్రూపుకు చెందిన వారి గా గుర్తించినట్టు కూడా తెలియజేశారు. సీత్ర బాంబుదాడి స్థలంలో జరిగిన ఫొరెన్సిక్ పరీక్షలలో హైగ్రేడు పేలుడు పదార్ధం (C4) ను వాడినట్టు మేజర్ జనరల్ అల్ హస్సాన్ తెలియజేశారు. ఇంకా, నిందితుల నుండి తెలుసుకున్న సమాచారం మేరకు వివిధ బాంబులు, బాంబు తయారీ పదార్ధాలు, వాడడానికి సిద్ధం చేసిన బాంబులను కనిపెట్టినట్టు కూడా ఆయన తెలియజేశారు.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







