సర్జికల్ దాడుల ప్రభావం దేశంలోని వాణిజ్య విమానాలపై పడింది.
- October 02, 2016
ఉడీ ఉగ్రవాద దాడుల నేపథ్యంలో భారత్ నిర్వహించిన సర్జికల్ దాడుల ప్రభావం దేశంలోని వాణిజ్య విమానాలపై పడింది. దాయాది పాకిస్థాన్ తన గగనతలంలో తక్కువ ఎత్తులో విమాన ప్రయాణాలను నిషేధించింది. దీంతో అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు భారత్ నుంచి వెళ్లే విమానాలు రూటు (మార్గం) మార్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.
లాహోర్ మీదుగా వెళ్లే విమానాలు లాహోర్ దాటుతున్నప్పుడు 29వేల అడుగుల కన్న ఎక్కువ ఎత్తులో ప్రయాణించాలంటూ పాక్ ఏవిషయేషన్ అధికారులు తాజాగా నోటమ్ (వైమానిక సిబ్బందికి నోట్) జారీచేశారు. అక్టోబర్ నెలంతా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. గత సోమవారం కరాచీ నగరం విషయంలోనూ పాక్ ఇలాంటి ఉత్తర్వులు జారీచేసింది.కరాచీ మీదుగా వెళ్లే విమానాలు 33వేల అడుగుల ఎత్తులో ప్రయాణించాల్సి ఉంటుందని ఆంక్షలు విధించింది. తక్కువ ఎత్తులో వెళ్లే గగనతల మార్గాన్ని పాక్ తన యుద్ధ విమానాల కోసం రిజర్వు చేసినట్టు కథనాలు వచ్చాయి. పాక్ తాజా ఆంక్షల నేపథ్యంలో భారత్ విమానాలు సురక్షితంగా ప్రయాణించేందుకు సుదూర మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుందని, దీంతో దేశం నుంచి వెళ్లే విమానాలు ఆలస్యమయ్యే అవకాశముందని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం పాకిస్థాన్ ఇంటర్నేషనరల్ ఎయిర్‌లైన్స్ మాత్రమే భారత్-పాక్ మధ్య విమానాలు నడుపుతున్నది
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







