పాస్‌పోర్ట్ బిడ్డింగ్‌ని రద్దు చేసిన ఇండియన్ ఎంబసీ
- October 03, 2016
అబుదాబీ: అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ, ఇండియన్ పాస్‌పోర్ట్ మరియు వీసా అప్లికేషన్లను ప్రాసెస్ చేసేందుకుగాను కొత్త ఏజెన్సీ కోసం ప్రారంభించిన బిడ్డింగ్ ప్రాసెస్‌ని రద్దు చేసింది. ఈ మేరకు సీనియర్ డిప్లమాట్ స్పష్టతనిచ్చారు. కొన్ని సాంకేతిక సమస్యలతో టెండర్ ప్రక్రియను రద్దు చేసినట్లు అబుదాబీ ఇండియన్ ఎంబసీ ప్రతినిథి నీతా భూషన్ చెప్పారు. ఈ సేవల్ని మూడేళ్ళపాటు అందించిన బిఎల్‌ఎస్ ఇంటర్నేషనల్ సంస్థ టెర్మ్ గత ఏడాదితో ముగిసిందనీ, అయినప్పటికీ ఆగస్ట్ 2016 వరకూ పొడిగించామనీ భూషన్ వివరించారు. అలాగే తాజా పరిణామాల నేపథ్యంలో మరోమారు బిఎల్‌ఎస్ టెర్మ్‌ని 2017 జనవరి వరకూ పొడిగించినట్లు తెలిపారు. త్వరలోనే కొత్త బిడ్డింగ్ ప్రాసెస్‌ని ప్రారంభిస్తామని ఆమె చెప్పారు. ఈ మార్పుల కారణంగా పాస్‌పోర్ట్ సేవలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదనీ, కొన్నిసార్లు తలెత్తుతున్న ఇబ్బందులు సాంకేతిక పరమైనవి మాత్రమేననీ, వాటిల్లో లీగల్ సమస్యలు ముఖ్యమైనవని ఆమె స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







