దుబాయ్ మెట్రోలో ఆర్‌టిఎ 3డి ప్రింటింగ్
- October 03, 2016
దుబాయ్: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ), టివిఎమ్ (టికెట్ వెండింగ్ మెషీన్స్), టికెట్ గేట్స్‌కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విభాగాల కోసం త్రీడి ప్రింటింగ్ విధానాన్ని ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సరికొత్త సంచలనాలకు తెరలేపిందనీ, ఈ కారణంగానే ఆర్‌టిఎ త్రీడి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆర్‌టిఎ రైల్ ఏజెన్సీ సిఇఓ అబ్దుల్ మొహిసిన్ ఇబ్రహీమ్ యూనెస్ తెలిపారు. త్రీడీ ప్రింటింగ్ విధానం ద్వారా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్‌ని తగ్గించగలుగుతున్నామనీ, తద్వారా తగ్గే వ్యయం చాలా ఎక్కువగానే ఉంటోందనీ, దీని ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు, వారికీ ఆర్థిక భారం తగ్గించడానికి వీలు కుదురుతుందని ఆయన తెలిపారు. వేస్టేజ్ తగ్గించడం, మెరుగైన ఉత్పత్తుల్ని తయారు చేయడం వంటివి త్రీడి ప్రింటింగ్ టెక్నాలజీలో సంచలనాలుగా చెప్పవచ్చు. రీసైక్లింగ్ కూడా ఎంతో తేలికైన పని కావడంతో త్రీడి టెక్నాలజీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతాల్ని సృష్టిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







