'నాగాభరణం' ఆడియో విడుదల...
- October 03, 2016
కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం 'నాగాభరణం'. రమ్య, దిగంత, సాయికుమార్ కీలక పాత్రధారులు. సాజిద్ ఖురేషి, ధావల్ గడ, సోహైల్ అన్సారీ నిర్మాతలు. గురుకిరణ్ సంగీతం అందించారు. ఇటీవల ఈ చిత్రం పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఎన.శంకర్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీని సాయికుమార్ స్వీకరించారు. కోడి రామకృష్ణ మాట్లాడుతూ ''సినిమా తియ్యాలంటే సృజనాత్మకత ఉంటే సరిపోదు. మంచి కథ, తపన గల నిర్మాత కావాలి. పాము నేపథ్యంలో కథ చెప్పగానే సాజిద్ వెంటనే అంగీకరించారు. నాకిష్టమైన కన్నడ నటుడు విష్ణువర్థనను గ్రాఫిక్స్‌లో క్రియేట్ చేసి ఓ కీలక పాత్రలో కనిపించేలా చేశాం.
ఆ సన్నివేశాలు చూసి విష్ణువర్ధన భార్య కన్నీరు పెట్టకున్నారు. ఆయన నటించిన చివరి చిత్రంలో మళ్లీ నటుడిగానే పుడతానని చెప్పారు. దానికి ఈ చిత్రం ట్రైలర్ అని చెప్పొచ్చు'' అని అన్నారు. ''ఈ నెల 14న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అని నిర్మాతలు తెలిపారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







