పోలీసులకు చిక్కిన ఇంటర్నేషనల్ గ్యాంగ్
- October 03, 2016
షార్జా: షార్జా పోలీస్ అలాగే ఫెడరల్ క్రిమినల్ పోలీస్ సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో ఐదుగురు సభ్యుల అంతర్జాతీయ గ్యాంగ్ పట్టుబడింది. క్రెడిట్ కార్డుల్లోని సమాచారాన్ని దొంగిలించి, ఖాతాదారుల సొమ్ముని కాజేయడం ఈ గ్యాంగ్‌కి నిత్యకృత్యమయిపోయింది. వినియోగదారుల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులతో రంగంలోకి దిగిన షార్జా పోలీస్, పెడరల్ క్రిమినల్ పోలీస్ ఓ టీమ్‌గా ఫామ్ అయి, దుండగుల ఆచూకీ కోసం స్కెచ్ ప్రిపేర్ చేశాయి. ఈ ముఠాకి చెందిన పలువురు వ్యక్తులు షాపింగ్ మాల్స్, హోటల్స్‌లో క్రెడిట్ కార్డుల సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లు గుర్తించింది ఇన్వెస్టిగేటింగ్ టీమ్. అలా ఐదుగుర్ని అరెస్టు చేసి, వారు ఏ విధంగా నేరానికి పాల్పడుతున్నదీ తెలియజేశారు పోలీసులు. హోటల్‌కి లేదా షాపింగ్ మాల్స్‌కి వచ్చే వినియోగదారులు పెద్ద మొత్తంలో చెల్లించినప్పుడు, వారి కార్డుల నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ఆయా సంస్థలకు చెందిన కొందరిని తెలివిగా తమ కుట్రల్లోకి లాగుతారు దుండగులు. తద్వారా సమాచారాన్ని తస్కరించి, ఆయా అక్కౌంట్లను ఖాళీ చేస్తారు. అరెస్టు చేసిన గ్యాంగ్ సభ్యుల్ని పోలీసులు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి పంపించారు.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







