ఉద్యోగికి 86,785 ఖతారీ రియాల్స్ చెల్లించాల్సిందిగా ఆదేశం
- October 03, 2016
ఖతార్: అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్, ఓ కంపెనీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ కంపెనీలో గతంలో పనిచేసిన ఉద్యోగికి 86,785 ఖతారీ రియాల్స్ కాంపెన్సేషన్గా చెల్లించాలని ఆదేశించింది న్యాయస్థానం. స్వదేశానికి వెళ్ళేందుకు ఈ మొత్తం చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆ సంస్థలో పనిచేసిన ఉద్యోగి, తనను సదరు సంస్థ అకారణంగా విధుల్లోంచి తొలగించిందని ఆరోపిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో, న్యాయస్థానం కేసుని విచారించి సదరు సంస్థదే తప్పని తేల్చింది. కోర్టు ఖర్చులు చెల్లించాలనీ, అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలనీ, మిగతా సర్టిఫికెట్స్ అన్నీ ఆ ఉద్యోగికి ఇచ్చేయాలనీ, వీటితోపాటుగా నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







