మన అమరావతి
- August 14, 2015
2015,జూన్ 6 వ తేది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ దగినరోజు ,ఆంధ్రుల కల నవ్యాంధ్ర రాజధాని భూమి పూజ జరిగిన రోజు ,తెలుగు నేల ,తెలుగు తల్లి పులకించిన రోజు,కృష్ణమ్మ ఆనందంతో ఉప్పొంగిన రోజు ఎందుకంటే
-అమరావతి 2,200 సంవత్సరాల గత వైభవ విశిష్టత కలిగినది.
- కృష్ణమ్మ ఒడిలో అలరారిన ప్రదేశం.
- అమరావతి క్రీ . పూ 2 వ శతాబ్దంలో అశోకుని బౌద్ద స్థూపాలతో ,నాగార్జునకొండ విశిష్టత లతో , బౌద్దమతము ఫరిడవిల్లిన ప్రదేశం
- అమరావతి శిల్పకళ భారతదేశంలోని 3 శిల్పకళలలో ఒకటిగా ప్రసిద్ది చెందినది . మిగిలినవి {గాంధార & మధుర }
- ఇక్కడి అనేక శిల్ప కళా ఖండాలు ఇప్పటికి మద్రాస్ మ్యూజియం లోను ,లండన్ లోని బ్రిటిష్ మ్యూజియం లోను అమరావతి కళా సంపదగా ప్రత్యేకంగా ప్రదర్శింప బడుతుంది.
- పవిత్రమైన అమరేశ్వర ఆలయం పంచారామాలలో ఒకటిగా భాసిల్లుతున్నది.
- పురాణాల ప్రకారం దేవేంద్రుడి రాజధానిగా అమరావతిని చెపుతారు.
- ఇక్కడి పార్శ్వనాద తీర్ధ ,జైనులకు పరమ పవిత్ర క్షేత్రం.
- క్రీ . పూ 2 వ శతాబ్దంలోధరణికోటను రాజధానిగా చేసుకొని 450 సంవత్సరములు శాతవాహనులు
మహా రాజ్యాన్ని పరిపాలించిన ప్రదేశం.
- ఇక్కడి నుండే మన సంస్కృతి ,సాంప్రదాయాలు ఆగ్నేయ ఆసియా దేశాలకూ విస్తరించాయి {మలేసియా ,ఇండోనేసియా ,ఫిలిప్పేన్స్ ,థాయిలాండ్ మరియు సింగపూర్ }
- తెలుగు భాష ,సంస్కృతి ,సంప్రదాయాల పురిటి గడ్డ ఈ ప్రాంతం.
- పచ్చని వరిపొలాలతో ఆంధ్రుల అన్నపూర్ణగా నిలిచిన ప్రదేశం.
- వాడరేవు మరియు మచిలీపట్నం ఓడరేవులకు సుమారు 100 కి.మి దూరంలో సముద్ర వాణిజ్యానికి అనుకూల ప్రదేశం అమరావతి.
- అమరావతి ఆంధ్రప్రదేశ్ కు మధ్యలో అందరికి అనుకూలముగా ఉన్నది.
- ఇటువైపు 1953లో ఒకప్పటి రాజధాని కర్నూలు ఉన్నప్పటికీ ,అటువైపు అతిపెద్ద నగరం విశాఖపట్నం ఉన్నప్పటికీ ,ప్రజలు విశాల దృక్పధంతో అంగీకరించిన రాజధాని ప్రాంతం అమరవతి.
- వినూత్న పధకంలో భాగంగా భూ సమీకరణ ద్వారా తమ భూములను ,రాజధానికై ధారపోసిన రైతన్నలకు ,అన్నదాతలకు జేజేలు పలుకుతూ పాదాభివందనాలు అర్పిద్దాం.
- హేతుబద్ధం కాని విభజనలో నష్టపోయినప్పటికీ , ఆంధ్రప్రజల దృఢ సంకల్ప నిదర్శనమే సంవత్సరం లోపు నవ్యాంధ్ర రాజధానికి నాంది ,పునాది.
- కారణాలు ఏమైనప్పటికీ ,రాష్ట్రం ఏర్పడిన 60 సంవత్సరాల తరువాత కుడా నిలువనీడ లేక రాజధానిని వెతుక్కుంటున్న ఆంధ్రులలో దైర్యాన్ని నింపుతున్న అమరావతి.
- ఆంధ్రప్రదేశ్ ,అమరావతులు అక్షరాలలోనే కాక అభివృద్ధిలోనూ గణనీయమైన ప్రగతిని సాధించి మన తెలుగు ప్రజల ఆశలు ,ఆకాంక్షలు నెరవేర్చి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిలబడుతుందని ఆకాంక్షిద్దాం.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్







