ఒమన్‌లో అమ్నెస్టీ కోరుతున్న వలస కార్మికులు
- October 03, 2016
మస్కట్: తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తమపై అమ్నెస్టీ చూపాలంటూ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఒమన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమపై దయ చూపిస్తే, తాము స్వదేశానికి వెళ్ళిపోతామని వారంతా కోరుతున్నారు. వీరిలో ఎక్కువమంది బంగ్లాదేశ్‌కి చెందినవారే ఉన్నారు. అక్రమంగా దేశంలో నివసిస్తున్నవారికి ప్రభుత్వం ప్రతి నెలా జరీమానాలు విధిస్తూ వస్తోంది. అయితే ఆ జరీమానాలు చెల్లించలేని దయనీయ స్థితిలో ఉన్నామని అక్రమ వలసదారులు వాపోతున్నారు. పని లేక, ఆదాయం లేక దయనీయంగా తమ జీవితాల్ని వెల్లదీస్తున్నట్లు వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చూసి బంగ్లాదేశ్ ఎంబసీ, అత్యవసరంగా అమ్నెస్టీ అవసరమని అభిప్రాయపడుతోంది. ఒమన్‌ని విడిచి వెళ్ళేందుకే వేలాది రియాల్స్ చెల్లించాల్సిన పరిస్థితి కొందరికి ఏర్పడిందని బంగ్లాదేశ్ ఎంబసీకి చెందిన అధికారి ఒకరు పేర్కొన్నారు. అమ్నెస్టీ ద్వారా, వలస కార్మికులు ఎలాంటి జరీమానాలు చెల్లించకుండా స్వదేశానికి వెళ్ళే అవకాశం ఉంది. మే 3, 2015న చివరిసారిగా అమ్నెస్టీని అనౌన్స్ చేశారు. మూడు నెలలపాటు అది అమల్లో ఉంది. ఆ సమయంలో 23,653 మంది వలసకార్మికులు ఒమన్‌ని వీడారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







