భారత పర్యటనకు వచ్చిన సింగపూర్ ప్రధాని లీ హెసైన్ లూంగ్..
- October 04, 2016
భారత పర్యటనకు వచ్చిన సింగపూర్ ప్రధాని లీ హెసైన్ లూంగ్ బస్సు ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయిదు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన లూంగ్ దిల్లీలో వీఐపీ కాన్వాయ్‌లో కాకుండా చార్టర్డ్ బస్సులో తను బస చేసే హోటల్‌కు వెళ్లారు. లూంగ్‌తో పాటు ఆయన సతీమణి హో చింగ్, పలువురు కీలక మంత్రులు, ఎంపీలు, సీనియర్ అధికారులు భారత్‌కు చేరుకున్నారు. సోమవారం రాత్రి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారికి కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి హోటల్‌కు వెళ్లడానికి లూంగ్ వీఐపీ కాన్వాయ్‌కు బదులుగా చార్టర్డ్ బస్సును ఎంచుకున్నారు.ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్ ప్రధాని లూంగ్ గౌరవార్థం వారికి అధికారిక విందు ఇవ్వనున్నారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. అలాగే పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. భారత పర్యటనలో భాగంగా లూంగ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్లతోనూ సమావేశం కానున్నారు.అక్టోబరు 5, 6 తేదీల్లో లూంగ్ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ పర్యటనకు వెళ్లనున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే వారికి అధికారికంగా విందు ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







