ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ మరికొద్ది రోజుల్లో శుభం కార్డ్ పడటం ఖాయం..
- October 04, 2016
ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్‌లో షాపింగ్ చేసేవారి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. సైట్స్ కూడా రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. జనవరి 2014 లెక్కల ప్రకారం దాదాపు ఇండియాలో 200 మిలియన్ల మంది ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే రెగ్యులర్ యూజర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ లెక్కల ప్రకారం ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ లాభాల బాటలో పయనిస్తున్నాయని చెప్పక తప్పదు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు. ఏవో ఆ రెండు, మూడు ప్రముఖ సైట్స్ తప్ప మిగిలిన చాలా చిన్నాచితకా సైట్స్ నష్టాలను చవిచూస్తున్నాయి. అకస్మాత్తుగా మూసేయలేక, కొనసాగించలేక మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటికే మెట్రో నగరాల్లో మాత్రమే ఆన్‌లైన్ సేవలందించే నాలుగు వెబ్‌సైట్స్ తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.అయితే కొన్ని వస్తువులపై అమ్మకాలను మాత్రమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, దాదాపుగా మరికొద్ది రోజుల్లో శుభం కార్డ్ పడటం ఖాయంగానే కనిపిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఆ షాపింగ్ సైట్స్ పేర్లను వెల్లడించే అవకాశముంది. ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ ప్రకటిస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్స్‌ను తట్టుకుని నిలబడలేకే ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిణామం కొత్తేమీ కాదు.గతంలో కూడా అలా మూతపడిన షాపింగ్ సైట్స్ ఉన్నాయి. వాటి వివరాలివి... 1. కూల్‌కార్ట్.కామ్(సంస్థ కోఫౌండర్ తప్పుకోవడంతో మూసివేయాలని నిర్ణయం) 2.మిరాయిస్టోర్, బెంగళూరు 3. రాక్.ఇన్, ముంబై 4. తింతరా.కామ్
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







