బంగారం ధర బాగా తగ్గింది
- October 05, 2016
అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండు లేమితో పాటు అమెరికా ఫెడ్ రేట్లు పెరుగుతాయనే వూహాగానాల నేపథ్యంలో బంగారం ధర బాగా తగ్గింది. దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండు తగ్గడంతో పసిడి ధర రూ.31వేల దిగువకు పడిపోయింది. నేటి బులియన్ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.730 తగ్గి రూ.30,520కి చేరింది. ఈ ఏడాదిలో ఒక్క రోజులో తగ్గిన అత్యధిక మొత్తం ఇదే. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర బాగా తగ్గింది. జూన్ నుంచి తొలిసారిగా ఔన్సు బంగారం ధర 1300 డాలర్ల దిగువకు పడిపోయింది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం 1268డాలర్లుగా ఉంది. .
వెండి ధర కూడా రికార్డు స్థాయిలో పడిపోయింది.కేజీ వెండి ఏకంగా రూ.1750 తగ్గి రూ.43,250కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ వెండి ధర బాగా తగ్గిపోయింది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు వెండి ధర 17.78 డాలర్లుగా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కూడా వెండికి డిమాండ్ తగ్గినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







