'భారత్ మాత’ కీ జై!
- August 14, 2015
అవనీంద్ర చిత్రించిన భారత మాత, 1940లలో భారత మాత రూపం
కిరణ్ చంద్ర బెనర్జీ అక్షర రూపంఅవనీంద్ర రాయ్ కుంచె నుంచి ఆవిష్కారం
త్రివర్ణ పతాకం... మన జాతీయ జెండా! దీని రూపకర్త పింగళి వెంకయ్య. జనగణమన.... మన జాతీయ గీతం! దీని రచయిత రవీంద్రనాథ్ టాగోర్!.. వందే మాతరం... మన జాతీయ గేయం! రచించింది బంకించంద్ర ఛటర్జీ! భారత మాత... మన దేశానికి ఊహాత్మక ప్రతిరూపం! మరి, ‘భారత మాత’ అనే భావనకు, ఆ రూపానికి మూలం ఎక్కడుందో తెలుసా?
...‘భారత్‌మాతా కీ జై’... తనువు, మనసు పులకిస్తుండగా స్వర పేటికను చీల్చుకుని పెల్లుబికే నినాదమిది! దేశమంతా ప్రతిధ్వనించే నినాదమిది! ఒక దేశాన్ని మాతృమూర్తిగా భావిస్తూ, ఆమెకు ఒక రూపం ఇవ్వడం ఒక అపూరూపం! భారత స్వాతంత్ర్యోద్యమ రూపాల్లో ‘సాహిత్య పోరాటం’ కూడా ఒకటి! ఈ సాహిత్య మధురిమల నుంచే ‘భరత మాత’ భావన ఆవిష్కృతమైంది. కిరణ్ చంద్ర బెనర్జీ అనే బెంగాలీ రచయిత ‘భరత మాత’ అనే నాటకాన్ని రచించారు. దీనిని తొలిసారిగా 1873లో ప్రదర్శించారు. దీని ద్వారా ‘భరత మాత’ అనే భావన జనంలోకి వెళ్లింది. దేశానికి ఒక రూపం ఇవ్వడం అదే తొలిసారి. ఇక... 1882లో బంకించంద్ర ఛటర్జీ తన నవల ‘ఆనంద్ మఠ్’లో దేశాన్ని మాతగా కీర్తిస్తూ ‘వందే మాతరం’ గేయాన్ని పొందుపరిచారు. ‘వందేమాతరం’ నినాదం స్వాతంత్రోద్యమానికి కొత్త ఊపును, ఉత్సాహాన్ని తెచ్చింది. ఇక... మొట్టమొదటిసారిగా అవనీంద్రనాథ్ టాగోర్ అనే ప్రఖ్యాత చిత్రకారుడు ‘భరత మాత’ చిత్రాన్ని గీశారు. ఒకరకంగా చెప్పాలంటే... దేశాన్ని ఆయన దేవతగానే చూపించారు. కాషాయ రంగు చీరె, నాలుగు చేతులు... ఒక చేతిలో వేదాలు (పుస్తకాలు), మరో చేతిలో వరి కంకులు, మరో చేతిలో జపమాల, ఇంకో చేతిలో ధవళ వస్త్రం! పాదాల ముందు తెల్ల కలువలు! ఇదీ... అవనీంద్ర రాయ్ చిత్రించిన భారత మాత రూపం. ఈ చిత్రం సిస్టర్ నివేదితను ఎంతగానో ఆకట్టుకుంది. తన పిల్లలకు శిక్ష (విద్య), దీక్ష, అన్నం, వస్త్రం అందించే దేవతగా ఆమె భరత మాతను అభివర్ణించారు. సాకార రూపాలను ఆరాధించే అలవాటున్న వారి గుండెలపై ‘భరత మాత’ రూపం కొలువైంది. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం, దేశం కోసం పాటుపడటం ‘దేశ భక్తి’గా మారింది. కాల క్రమంలో అవనీంద్ర రాయ్ చిత్రించిన ‘భరత మాత’ రూపంలోనూ మార్పుచేర్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు... భారత దేశ చిత్రం ముందు, తలపై కిరీటం, ఒక చేతిలో త్రివర్ణ పతాకం బూనిన మహిళనే భరత మాతగా ముద్రిస్తున్నారు. కొందరు ‘దుర్గా దేవి’ని తలపింపచేసేలా సింహాన్ని కూడా జత చేస్తున్నారు. అయితే... ‘భరత మాత’ రూపాన్ని ప్రభుత్వాలు అధికారికంగా గుర్తించలేదు.
--యం.వాసుదేవరావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









