షార్జాలో 20 శాతం పార్కింగ్ డిస్కౌంట్
- October 05, 2016
షార్జా మున్సిపాలిటీ ఎమిరేట్ లో నివసిస్తున్న విశ్రాంత ఉద్యోగులు, విశ్వవిద్యాలయ విద్యార్ధులు, అలాగే స్థానిక మరియు సమాఖ్య ప్రభుత్వ ఉద్యోగుల కోసం పార్కింగ్ చందాదారుల ఫీజు శాతం 20 శాతం రాయితీ అందించనుందిషార్జా మున్సిపాలిటీ వద్ద పార్కింగ్ శాఖ డైరెక్టర్ అట్టిఫ్ అల్ జరూని మాట్లాడుతూ ఈ అసాధారణ అవకాశం పౌరులు మరియు ఎమిరేట్ లో ప్రవాసీయులకు చందా కార్డులు ఆధారంగా ఇచ్చిందని తెలిపారు. ఈ 20 శాతం డిస్కౌంట్ మూడు రకాల చందాదారులకు ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. ఉదాహరణకు, పైన వర్గానికి చెందిన ఒక మూడు నెలల చందాదారుల ఇప్పుడు 600 డి. హెచ్ చెల్లించాలి. అలాగే ఒక ఆరు నెలల చందాదారుడు1,050 డి.హెచ్ చెల్లిస్తే చాలు. ఏడాది చందాదారుల1,850 డి.హెచ్ చెల్లించాలి. డిస్కౌంట్ పొందగోరేవారు విధిగా అవసరమైన పత్రాలు సమర్పించాలి. అందుకోసం కారు రిజిస్ట్రేషన్, ఉద్యోగి కార్డులు మరియు గుర్తింపు కార్డులు కలిగి ఉండాలి. పార్కింగ్ కార్డులు మూడు రకాలగా ఉంటాయని అల్ జరూని పేర్కొన్నారు.ఇవి వ్యక్తిగతమైన చందా కార్డు, వాణిజ్యపరమైన చందా కారు మరియు అసాధారణ చందా కార్డులుగా అందిస్తారని తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







