2 మిలియన్లు దాటిన ఖతార్ విజిటర్స్
- October 05, 2016
ఖతార్: ఈ ఏడాది ఇప్పటిదాకా ఖతార్‌ని సందర్శించినవారి సంఖ్య 2.182 మిలియన్లకు చేరుకుందని ఖతార్ టూరిజం అథారిటీ (క్యుటిఎ) వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్‌లో జిసిసి దేశాలకు చెందినవారు ఎక్కువగా ఖతార్‌ని విజిట్ చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2015తో పోల్చితే సౌదీ అరేబియా, యూఏఈలనుంచి వచ్చినవారి సంఖ్య 8 శాతం, 17 శాతం పెరుగుదల నమోదయ్యింది. బహ్రెయిన్, కువైట్ నుంచి వచ్చిన వారి శాతం 3 మరియు 2 అధికంగా ఉంది. ఒమన్ నుంచి వచ్చినవారి సంఖ్యలో మాత్రం 5 శాతం తగ్గుదల నమోదయ్యింది. జిసిసి రీజియన్ నుంచి వచ్చినవారి సంఖ్య 7 శాతం పెరుగుదల నమోదు చేసింది. సెప్టెంబర్‌లో కేవలం సౌదీ నుంచి వచ్చినవారి సంఖ్య 100,000గా ఉంది. ఖతార్ తొలిసారిగా క్రూయిజ్ షిప్‌ని అక్టోబర్ 18న 45 దేశాలకు చెందిన టూరిస్టుల్ని ఆహ్వానించనుంది. క్యుటిఎ ముందు ముందు మరింతగా విజిటర్స్‌ని ఆకర్షించేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేయనుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







