దుబాయ్‌ మెరీనాలో వాటర్‌ బస్‌ కోసం ఎన్‌ఓఎల్‌ సర్వీస్‌

- October 07, 2016 , by Maagulf
దుబాయ్‌ మెరీనాలో వాటర్‌ బస్‌ కోసం ఎన్‌ఓఎల్‌ సర్వీస్‌

రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ) ఎన్‌ఓఎల్‌ కార్డు సర్వీసుల్ని, దుబాయ్‌ మెరినాకి చెందిన నాలుగు స్టేషన్లలో (అంటే మెరినా ప్రోమెండె, మెరినా వాక్‌, మెరినా మాల్‌ మరియు మెరినా టెర్రాస్‌) చెల్లుబాటయ్యేలా విస్తరించింది. మెరినా ట్రాన్స్‌పోర్ట్‌ డైరెక్టర్‌ మన్సూర్‌ అల్‌ ఫలాసి మాట్లాడుతూ మెరైన్‌ ట్రాన్సిట్‌ మోడ్స్‌కి కూడా ఎన్‌ఓఎల్‌ కార్డుల ద్వారా చెల్లింపు కోసం సేవల్ని విస్తరించినట్లుగా తెలిపారు. వాటర్‌ బస్‌ పేర్‌ని ఎన్‌ఓఎల్‌ కార్డుల ద్వారా చెల్లించడం ద్వారా వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వాటర్‌ బస్‌ ప్రతి 20 నిమిషాలకూ అందుబాటులో ఉంటుంది. శుక్రవారాలు మరియు పబ్లిక్‌ హాలిడేస్‌లో మాత్రం మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు వాటర్‌ బస్‌ అందుబాటులో ఉంటుంది. ప్రతి వాటర్‌ బస్‌లో 36 మందికి వీలుగా ఏర్పాటులంటాయి. ఆన్‌ బోర్డ్‌ కార్డ్‌ రీడర్‌లో ఎన్‌ఓఎల్‌ కార్డుల్ని స్వైప్‌ చేయడం ద్వారా వాటర్‌ బస్‌ రైడ్‌ని ఎంజాయ్‌ చేయొచ్చు. ఎన్‌ఓఎల్‌ కార్డుల్లో మినిమమ్‌ 11 అరబ్‌ ఎమిరేట్‌ దినార్స్‌ బ్యాలెన్స్‌ ఉంటేనే వాటర్‌ బస్‌లోకి అనుమతిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com