త్వరలో విడుదల కానున్న'నాగభరణం'
- October 07, 2016
గతజన్మ స్మృతుల అన్వేషణలో ఓ నాగకన్యకు ఎదురైన సంఘటనలు ఏంటి? ప్రతికూల శక్తులపై ఆమె ఎటువంటి పోరాటం చేశారు? నాగకన్య నేపథ్యం ఏంటి? అనే కథాంశంతో తెరకెక్కిన సోషియో ఫాంటసీ థ్రిల్లర్ 'నాగభరణం'. కోడి రామకృష్ణ దర్శకత్వంలో సాజీద్ ఖురేషి, ధావల్ గడ, సొహైల్ అన్సారీ నిర్మించారు. రమ్య, దిగంత్, సాయికుమార్ ప్రధాన పాత్రధారులు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ నెల 14న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ''క్లైమాక్స్‌లో స్వర్గీయ కన్నడ నటుడు విష్ణువర్థన్‌ను గ్రాఫిక్స్ రూపంలో పునఃసృష్టించిన సన్నివేశాలు అలరిస్తాయి.
మకుట సంస్థ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకి బలం.
కొత్తదనం కోరుకునే ప్రతి ఒక్కరినీ ఈ సినిమా మెప్పిస్తుంది'' అన్నారు కోడి రామకృష్ణ. ఇటీవల విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు చక్కటి ప్రేక్షకాదరణ లభించిందని శివకుమార్ తెలిపారు. ముకుల్‌దేవ్, రవి కాలే తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: వేణు, సంగీతం: గురుకిరణ్.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







