ఎడారి దేశంలో పూల తేరులు
- October 09, 2016

ఎడారి దేశంలో పూలతేరులు పారాయి. ఇసుక నేలలపై ఇంద్రధనస్సు విరిసింది. ఖండాంతరాల్లోనూ బతుకమ్మ సంబురం అంబరాన్నంటుతోంది.
తెలంగాణలో తెలవారక ముందే తంగేడు, గునుగు, కట్ల, రుద్రాక్ష వంటి అడవిపూలను సేకరిస్తుంటారు. గల్ఫ్‌లోనూ పురుషులు ఉదయాన్నే అక్కడ దొరికే గునుగు పూలను తెంపుకొచ్చి పెద్దపెద్ద ఇత్తడి పాత్రలలో గుమ్మడి ఆకులను పేర్చారు.గునుగు పూలను పేర్చిన తరవాత స్థానికంగా దొరికే పూలతో అందంగా బతుకమ్మలను గోపురం ఆకారంలో అందమైన బతుకమ్మలను పేర్చారు.
అబుధబీలోని ఇండియన్ సోషల్ సెంటర్ లో శనివారం తెలంగాణ ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి .బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో .ఒక్కొక్క పూవేసి...ఒక్క జామాయే చందమామా అంటూ మహిళల బతుకమ్మ పాటలతో మైదానం మార్మోగింది
యూఏఈ లోని తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 1000మంది మహిళలు వివిధ రకాల పూలతో అలంకరించిన బతుకమ్మలను తీసుకువచ్చి బతుకమ్మ పాటలు కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా గడిపారు.అనoతరం నిర్వహకులు ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందజేశారు.
మహిళలు తమ వెంట తెచ్చుకున్న నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యాన్ని గౌరీదేవికి ప్రతిరూపమైన బతుకమ్మలకు సమర్పించాక ...వాయినంగా ఇచ్చిపుచ్చుకున్నారు. గౌరీ పూజ అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పావని అర్చన రోజా పద్మజ లత, పృథ్వీరాజ్, రాజా శ్రీనివాస రావు, గోపాల్, శ్రీనివాస్ రెడ్డి, వంశి,గంగా రెడ్డి, శల్మా, విజయ్, రవి,ప్రదీప్ చవ్వా (మాగల్ఫ్ ప్రతినిధి) తదితరులు పాల్గొన్నారు..






తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







