పులిమురుగన్ కి రికార్డు స్థాయిలో కలెక్షన్స్..
- October 10, 2016
మళయాల చిత్ర సీమలోనే మునుపెన్నడు లేని రీతన అత్యంత భారీ వసూళ్లతో దూసుకుపోతుంది మోహన్ లాల్ తాజా చిత్రం పులిమురుగన్. మల్లూవుడ్ లో ఇప్పటివరకు క్రియేటైన రికార్డులు అన్నిటిని బ్రేక్ చేస్తూ విడుదలైన మూడు రోజుల్లోనే దాదాపు 15 కోట్లకి పైగా కలెక్షన్స్ తెచ్చుకుంది ఈ విజువల్ వండర్. ప్రపంచవ్యప్తంగా కూడా పులి మురుగన్ కి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. మోహన్ లాల్ సినీ కెరీర్ లో ఈ రెంజ్ కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి, ఇక ఈ ఏడాది విడుదలైన మోహన్ లాల్ మరో సినిమా 'ఒప్పమ్' కూడా హిట్ టాక్ సొంతం చేసుకోవడం విశేషం. కేరళ సీమలో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోన్న పులిమురగన్ కు సంబంధించిన రైట్స్ కోసం అప్పుడే సౌత్ ఇండియాలో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థలు పోటిపడుతున్నాయి. త్వరలోనే పులిమురుగన్ తెలుగు వెర్షన్ గురించిన వివరాలు రాబోతున్నాయి. ఈ సినిమాకు నిర్మాత : తోమిచమ్ ములకుపాదమ్, దర్శకుడు : వైశాఖ, కథ : ఉదయకృష్ణ, సంగీతం : గోపీ సుందర్, కెమెరా : షాజీకుమార్.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







