ఉత్తర మయన్మార్ ఘర్షణల్లో 12మంది మృతి
- October 12, 2016
ఉత్తర మయన్మార్‌లోని రాఖినే రాష్ట్రంలో సాయుధ బలగాలు, సాయుధ గ్రూపు మధ్య జరిగిన ఘర్షణల్లో 12మంది మరణించారని ప్రభుత్వ మీడియా బుధవారం తెలిపింది. ప్రధానంగా రోహింగ్యా ముస్లిమ్ ప్రాబల్యం వుండే మాంగ్‌దా టౌన్‌షిప్‌లో మంగళవారం వందలాదిమంది వ్యక్తులు పిస్టళ్లు, కత్తులు ధరించి సైనిక బలగాలపై దాడులు చేయడంతో నలుగురు సైనికులు మరణించగా దాడి చేసిన వారు ఏడుగురు మరణించినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్ న్యూ లైట్ ఆఫ్ మయన్మార్ పేర్కొంది. మరణించిన వారి దగ్గర కత్తులు, కర్రలు కూడా వున్నాయి. ఈ దాడులు జరిగిన ప్రాంతం బంగ్లాదేశ్ సరిహద్దుకు ఎంతో దూరంలో లేదు. మూడు సరిహద్దు పోస్ట్‌లపై ఆదివారం జరిగిన దాడిలో 9మంది పోలీసు అధికారులు మరణించడంతో సైన్యం అక్కడ రంగంలోకి దిగింది.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2012లో జరిగిన రోహింగ్యా హింసాకాండ పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయి. ఆనాటి హింసాకాండలో వంద మందికి పైగా మృతి చెందారు. శరణార్ధ శిబిరాల్లో వేలాదిమంది తలదాచుకున్నారు. రోహింగ్యా ముస్లిమ్‌లను బంగ్లాదేశ్ నుండి వచ్చిన అక్రమ శరణార్ధులుగా బౌద్ధ జాతీయులు పరిగణిస్తారు.
వీరిలో చాలామందికి కొన్ని తరాల వెనుక మయన్మార్‌తో సంబంధాలున్నప్పటికీ వారిని ఇక్కడివారుగా ఒప్పుకోరు. కాగా ఈ సరిహద్దు దాడుల వెనుక గల ఆరుగురు అనుమానితుల్లో నలుగురిని మంగవారం పట్టుకున్నారు. కాగా సంయమనం పాటించాల్సిందిగా మయన్మార్‌లో ఐరాస ప్రత్యేక సలహాదారు విజరు నంబియార్ సైన్యానికి, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







