భీమవరంలో జనసేనాని టూర్..
- October 12, 2016
జనసేనాని మళ్లీ జనంలోకి వెళ్లనున్నారా? ప్రత్యేకహోదా అంశం చల్లారటంతో సైలెంట్ అయిన పవన్.. మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నారా? న్యాయం కోసం పోరాడుతున్న బాధితుల పక్షాన నిలబడేందుకు భీమవరం వెళ్లనున్నారా? జనసేన లేటెస్ట్ ప్రెస్‌నోట్ ఇదే కన్ఫామ్ చేస్తోంది.పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో నిర్మితమవుతోంది మెగా ఆక్వాఫుడ్ పార్క్. ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే 30 గ్రామాలు పూర్తిగా కాలుష్యం కోరల్లో చిక్కుకుంటాయని బాధితులు కొంతకాలంగా పోరాడుతున్నారు. అయినా ఆక్వా పార్క్ పనులు శరవేగంగా జరుగుతుండటంతో బాధితులు జనసేన అధ్యక్షడు పవన్ కల్యాణ్‌ను కలుసుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు.తుందుర్రు,కంసాలి,బేతపూడి,జొన్నలగరువు గ్రామాలకు చెందిన బాధితుల బృందం పవన్‌కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణం పూర్తయితే వచ్చే దుష్ఫలితాలను వివరించారు. కాకినాడలో జనసేన నిర్వహించిన ఆత్మగౌరవ సభలో వినతిపత్రం సమర్పించిన సంగతి కూడా గుర్తు చేసారు.దీనికి చలించిపోయిన పవన్ త్వరలోనే బాధిత గ్రామాల్లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.సమస్యను అందరం కలిసి ఎదుర్కొంటేనే పరిష్కారమవుతుందని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించే విధంగా కార్యక్రమం రూపొందించుకుందామని పవన్ బాధిత బృందంతో చెప్పారు. పారిశ్రామికాభివృద్ధికి తాము ఎంతమాత్రం వ్యతిరేకం కాదని అయితే అభివృద్ధి ప్రజల జీవనాన్ని చిధ్రం చేసే విధంగా ఉండకూడదని జనసేన స్పష్టం చేసింది.త్వరలోనే మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ గళం విప్పే సూచనలు కన్పిస్తున్నాయి. అతి త్వరలోనే భీమవరంలో జనసేనాని టూర్ ఖాయమని తెలుస్తోంది. మరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా సాగబోయే పవన్ భీమవరం టూర్ ఎంత సంచలనంగా నిలుస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







