'అల్లరి' నరేష్ కథానాయకుడిగా 'ఇంట్లో దెయ్యం. నాకేం భయం'...
- October 12, 2016
'అల్లరి' నరేష్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం 'ఇంట్లో దెయ్యం. నాకేం భయం'. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. నరేష్, నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో గతంలో 'సీమశాస్త్రి, 'సీమటపాకాయ్' చిత్రాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. 'అత్తారింటికి దారేది', 'నాన్నకు ప్రేమతో' వంటి చిత్రాలను అందించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, ఎల్.ఎల్.పి. పతాకంపై తాజా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఇంట్లో దెయ్యం. నాకేం భయం' చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇతర కార్యక్రమాలను పూర్తిచేసి నవంబర్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ 'ఇంట్లో దెయ్యం. నాకేం భయం' పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటుగా హార్రర్ టచ్ కూడా ఉంది. ఇటీవలే రెండు పాటలను బ్యాంకాక్‌లో చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తయింది. నవంబర్ 11న సినిమాను విడుదల చేస్తాం. మా సంస్థలో మరో సూపర్‌హిట్ సినిమా అవుతుందనే నమ్మకం ఉంది" అన్నారు. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ "అల్లరి నరేష్‌తో చేసిన సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. ఈ చిత్రం మా కాంబినేషన్లో హ్యాట్రిక్ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. వినోదంతో పాటుగా హార్రర్ మిళితమైన ఫ్యామిలీ డ్రామా ఇది. భారీ చిత్రాలు నిర్మించే ప్రసాద్‌గారు ఓ మంచి సినిమా చేయడం ఆనందంగా ఉంది " అన్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజేంద్రప్రసాద్, కృతిక, మౌర్యాని, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, కాదంబరి కిరణ్, ప్రగతి, రజిత, అపూర్వ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, ఛాయాగ్రహణం: దాశరథి శవేంద్ర, మాటలు : డైమండ్ రత్నబాబు, పాటలు: భాస్కరభట్ల, సమర్పణ: బోగవల్లి బాపినీడు.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్‌వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్









