దుబాయ్ లో ఎత్తయిన టవర్ నిర్మాణ పనులు ప్రారంభo..
- October 12, 2016
దుబాయ్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యాన్ని నిర్మించేందుకు సోమవారం నిర్మాణ పనులు ప్రారంభించారు. దుబారులోని పేరొందిన బుర్జు ఖలీఫా కంటే ఎత్తులో దీన్ని నిర్మించనున్నారు. 2020 నాటికి దీని నిర్మాణం పూర్తి చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. దుబారు ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. బుర్జు ఖలీఫా 829.8 మీటర్ల ఎత్తు (2722 అడుగు లు) ఉంటుంది. ప్రస్తుతం నిర్మించబోయే ఆకాశహర్మ్యం వెయ్యి మీటర్ల (3,281 అడుగులు ) ఎత్తు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. దీన్ని స్పానిష్-స్విస్ ఆర్కిటెక్ట్ శాంటియాగో డిజైన్ చేశారు. ఈ టవర్ నిర్మాణానికి 1.23 బిలియన్ డాలర్లు ( రూ.8,218 కోట్లు ) ఖర్చయ్యే అవకాశం ఉందని ఎమ్మార్ సంస్థ చైర్మన్ ముహ్మద్ అలబ్బార్ తెలిపారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







