'చిలుకూరి బాలాజీ' చిత్ర సెన్సార్ పూర్తి...
- October 12, 2016
సాయికుమార్, సుమన్ ప్రధాన తారాగణంగా టీమ్ ఇండియా ప్రొడక్షన్స్ ప్రై. లి. పతాకంపై అల్లాణి శ్రీధర్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'చిలుకూరి బాలాజీ'. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. యు సర్ట్ఫికెట్ లభించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ- సెన్సార్ అధికారుల ప్రశంసలు తమకు ధైర్యాన్ని ఇచ్చాయని, ఇటీవల చిన్నజీయర్ స్వామి విడుదల చేసిన ఆడియోకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోందని, ఈమధ్యకాలంలో వచ్చిన భక్తి సినిమా పాటల్లో ఇవే బాగా ఉన్నాయని పలువురు అభినందిస్తున్నారని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసిన ఈ చిత్రాన్ని నవంబర్ రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని, నేటి యువతరానికి వీసాలు ఇచ్చే బాలాజీగా ఆశీర్వాదాలందిస్తూ ఆరాధింపబడుతున్న చిలుకూరి బాలాజీ ఆలయ పురాణాన్ని ప్రాశస్త్యాన్ని తెలుపుతూ ఓ దృశ్యకావ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించామని ఆయన అన్నారు
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







