వృద్ధుడి పాత్రలో జగపతిబాబు
- October 13, 2016
విలన్ గా టర్న్ తీసుకున్న తరువాత జగపతి బాబు రేంజ్ మారిపోయింది. స్టార్ హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ తీసుకోవటంతో పాటు విభిన్న పాత్రలతో అలరిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా స్టార్ హీరోలకు ప్రతినాయకుడిగా జగ్గుభాయ్ తనే తీసుకుంటున్నారు. అయితే విలన్ గా మారిన తరువాత ఫుల్ బిజీ అయిన జగపతిబాబు ఇప్పుడు మరోసారి హీరోగా నటించేందుకు రెడీ అవుతున్నాడు.జాగ్వర్ ఆడియో రిలీజ్ సందర్భంగా కుమారస్వామి నిర్మాణంలో తాను హీరోగా ఓ సినిమా ఉంటుందంటూ ప్రకటించాడు జగ్గుభాయ్. ఆ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలను జాగ్వర్ సక్సెస్ మీట్ లో వెల్లడించారు. తాను లీడ్ రోల్ లో తెరకెక్కనున్న సినిమాకు తాను నిర్మాణ భాగస్వామిగా కూడా ఉంటానని తెలిపారు.జగపతి ఆర్ట్ పిక్చర్స్, చెన్నాంభిక ఫిలింస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తాయని తెలిపిన జగపతి బాబు, ఈ సినిమాలో తాను 60 ఏళ్ల వృద్ధుడిగా నటిస్తున్నట్టుగా తెలిపారు. ఈ సినిమాకు సంబందించిన సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







