మానవతకు నిదర్శనం సుష్మా స్వరాజ్ ..
- October 13, 2016
ఈ మధ్య జరిగిన సర్జికల్ స్ట్రయిక్స్ భారత్, పాక్ లమధ్య విభేదాలకు దారితీశాయి. మూడేళ్ళ క్రితం రాజస్థాన్ లోని జోధ్ ఫూర్ కు చెందిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నరేశ్ తేవానీకీ, పాకిస్తాన్ లోని కరాచీకి చెందిన ఎంబీఎ గ్రాడ్యుయేట్ ప్రియా బచ్చన్ కి నిశ్చితార్థం జరిగింది. అప్పట్నుంచి ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు జరుగుతున్నాయి. నవంబర్ 7న వీరి వివాహానికి ముహుర్తం నిర్ణయించారు ఇరు పక్షాల పెద్దలు. అయితే పాక్, భారత్ లమధ్య జరుగుతున్న దాడుల నేపధ్యంలో పాకిస్తాన్ లోని భారత్ ఎంబసీ వీసాలు ఇవ్వడం ఆపేసింది. దీంతో వివాహం జరుగుతుందా లేదా అని అనుమానాలు నెలకొన్నాయి పెద్దలకు. అయితే పెళ్ళికొడుకు తండ్రి నేరుగా విదేశాంగ మంత్రికి విషయాన్ని వివరిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన సుష్మా సాయం చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రెండు రోజుల్లోనే పెళ్ళికూతురికి, మరో 11 మంది కుటుంబ సభ్యులకు భారత ఎంబసీ వీసాలు మంజూరు చేసింది. ఇలాంటిదే మరో సంఘటనకు కూడా సుష్మ తనదైన రీతిలో స్పందించారు. రెండు రోజుల క్రితం ఠాక్రూ అనే భారతీయ మహిళ భర్త మరణించారు. తండ్రి అంత్య క్రియలు పూర్తి చేయాల్సిన కుమారుడు అభయ్ కౌల్ అమెరికాలో ఉండిపోయాడు. మానవతా కోణంతో ఆలోచించి మా అబ్బాయికి వీసా ఇప్పించండి అంటూ ఆ మహిళ సుష్మా స్వరాజ్ కు ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన సుష్మా వెంటనే స్పందించి ఎంక్వయిరీ చేశారు. అయితే దసరా, మొహర్రం సందర్భంగా సిబ్బంది విధులకు హాజరు కాలేదని ఎంబసీకి సెలవులని తెలిసింది. దీంతో సుష్మ పై అధికారులతో మాట్లాడి ఆ మహిళకు సమాధానమిస్తూ మీకోసం ఎంబసీని తెరిచాము, మీ అబ్బాయికి వీసా మంజూరు చేస్తున్నామని, ఇప్పుడతను భారత్ కు వచ్చేందుకు ఎలాంటి ఇబ్బందీ లేదని తెలిపారు. దీంతో సదరు మహిళ సుష్మా స్వరాజ్ కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







