రాజధాని రియాల్లీ షో రెండవ ఘట్టం
- October 14, 2016
వచ్చే ఏడాది దసరా నాటికి అమరావతికి ఒక పూర్తి రూపం తీసుకుని వస్తాను అని ప్రజలకి బహిరంగ లేఖ రాశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దసరా రోజున వెలగపూడి లో కొత్త కార్యాలయం లోకి ప్రవేశించే ముందరే ఈ లేఖ ఆయన రాసిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయంగా కూడా ఆయన తప్పకుండా చెయ్యాల్సిన ప్రకటనగా చెప్పొచ్చు ఎందుకంటే ఈ ప్రభుత్వం పదవీ కాలం చేపట్టి దాదాపు రెండున్నర ఏళ్ళు పూర్తయ్యింది. మూడేళ్ళు ముగియడం తోనే ఎన్నికలు మొదలు అవుతాయి.అనుభవశాలి గనక చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి, ముఖ్యంగా రాజధాని నిర్మాణం చేయగలరని ఓటర్లు భావించే అవకాశం చాలా వుంటుందని వైసీపీ నాయకులు కూడా ముందునుంచే చెబుతూ వచ్చారు. విచిత్రమేమంటే విమర్శల మధ్యనే భూ సమీకరణకు రైతులు సహకరించినా కేంద్రం దాదాపు 2000 కోట్లు వివిధ రూపాల్లో ఇచ్చినా సింగపూర్‌తో సింక్ కాంట్రాక్టర్లను ఎంపిక బాగా సమయం తీసుకున్నాయి.సింగపూర్ సింగపూర్ అంటూ గత ఎన్నికల ముందర నుంచీ , ఎన్నికల్లో గెలిచిన తరవాత కూడా ఊదరగొట్టేసారు. బ్రిడ్జి ల దగ్గర నుంచీ బాత్ రూమ్ ల వరకూ అంతా సింగపూర్ నుంచి ఇంపోర్టింగ్ అనీ అక్కడి డిజైన్ లు తప్ప దేశీయ డిజైన్ లు తమకి వద్దే వద్దు అంటూ బాబుగారు సూపర్ కలరింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు.కట్ చేస్తే ఎక్కడ నుంచి ఇప్పటివరకూ అందింది జీరో. తెలుగుదేశం నాయకుల్లోనే ఈ విషయం మీద తీవ్ర అసంతృప్తి ఉంది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఈ సింగపూర్ ని అక్కడి కంపెనీలనీ లాక్కు రావడం కోసం కొత్త ఎత్తు వేస్తున్నారు బాబుగారు. అందులో భాగంగానే ప్రభుత్వం తన వంతుగా కార్యాలయాలు శాసన సభ , హాయ్ కోర్టు , రాజ్ భవన్ లాంటివి నిర్మిస్తూ వస్తుంది. ఆ దెబ్బకి భూముల విలువ అమాంతం పెరుగుతుంది. అది చూసి అయినా సింగపూర్ బాబులు వస్తారు అనీ పెరిగిన రేట్ లకి తమ వాటా అమ్ముకోవడం మొదలెడతారు అని ప్లాన్ అనమాట. వారిది అమ్ముడయ్యేవరకూ మిగిలిన భూమి అమ్మడానికి వుండదు. పైగావారికి అనుకున్న ప్రతిఫలం రాకపోతే గడువును పెంచాలి. షరతులు మార్చాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వమే ఏర్పాటుచేయాలి.మరొక పక్క ఇచ్చిన భూమికి ప్రతిఫలంగా ప్లాట్లు వచ్చిన రైతులని కూడా కమర్షియల్ కాంట్రాక్టుల కింద బిల్డింగ్ లు నిర్మించుకోవాలని కోరతారు. కొంతమంది అలా ఇచ్చిన తర్వాత చిన్న చితక ఎలాగూ ఒంటిరి గా చేయలేరు గనక అప్పగించకతప్పదు. పైగా వారినుంచి ఆ ప్టాట్లు కొనుగోలు చేయడం ప్రత్యక్ష పరోక్ష ఒత్తిళ్లతో ఒప్పందాల్లో ఇరికించడం జరగొచ్చు.. ఆ విధంగా రాజధాని రియాల్లీ షో రెండవ ఘట్టం నడుస్తుంది. ప్రభుత్వం నుంచి ఎవ్వరూ కనపడకుండా వెనక నుంచి కథ నడిపిస్తారు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ లతో ఇప్పటి నుంచే ప్రమోషన్ చేయిస్తున్నారు అంటే ఇలాంటి ఎన్నో హడావిడులు త్వరలో చూడాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







