జయరాజన్ రాజీనామా...
- October 14, 2016
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంత్రివర్గం నుంచి పరిశ్రమల శాఖ మంత్రి ఈ.పీ. జయరాజన్ నిష్క్రమించారు. రెండు వారాల నుంచి తనపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జయరాజన్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కీలక నియామకాల్లో ఆయన బంధుప్రీతికి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తన నిర్ణయాన్ని శుక్రవారం జరిగిన సీపీఎం రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశంలో ప్రకటించారు. సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి తీసుకున్న దృఢ నిర్ణయమే జయరాజన్ రాజీనామాకు ప్రధాన కారణమని సమాచారం. జయరాజన్ నిర్ణయాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ పత్రికా సమావేశంలో వెల్లడించారు.ఆయన నిర్ణయంతో సీపీఎంతో పాటు ఎల్డీఎఫ్ పేరు ప్రతిష్ఠలు మరింత పెరుగుతాయన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







