ఎం రత్నం తాజా ప్రాజెక్టులో పవన్‌కు జోడీగా నయనతార..
- October 14, 2016
టాలీవుడ్ స్టార్ పవన్‌కళ్యాణ్ కిశోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే నేసన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తమిళ చిత్రం వేదాలం రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ మూవీని ఎ ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.తాజా ప్రాజెక్టులో పవన్‌కు జోడీగా నయనతార నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు తెరపైన కనిపించని పవన్, నయన్‌ల కాంబినేషన్ సినిమాకు చాలా బాగా ఉపయోగపడుతుందని భావించిన చిత్ర యూనిట్ ఈ విషయమై నయనతారను సంప్రదించినట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.ఈ మూవీ స్క్రిప్ట్ నచ్చిన నయనతార సినిమాలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కథానుగుణంగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అవసరముంటుందట. ప్రస్తుతానికి నయన్‌ను మెయిన్ హీరోయిన్‌గా సెలెక్ట్ చేసిన నిర్మాతలు మరో హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభించారట.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







