20 నుంచి 27 వరకు ముంబై ఫిల్మ్ ఫెస్టివల్..
- October 14, 2016
ముంబై అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది సినిమా. భారతీయ సినిమాకు కేంద్రం. ప్రధాన స్రవంతి చిత్రాలే కాదు.. ఇండిపెండెంట్ చిత్రాలు, బి గ్రేడ్ చిత్రాలు సైతం ముంబై వేదికగా చలామణి అవుతుండడం గమనార్హం. ఇప్పుడా వేదికపై ఎన్నెన్నో ఆకట్టుకునే కథలు ఆవిష్కరించబడనున్నాయి. ఎన్నో చర్చలకు సైతం ముంబై వేదికకానుంది. అవును.. ఈ అక్టోబర్ సినిమా ప్రేమికులకు సరికొత్త అనుభూతిని మిగల్చనుంది. కోటాను కోట్ల ప్రేక్షకుల్ని కట్టిపడేసిన చిత్రాలు మిమ్మల్ని అలరించనున్నాయి. ప్రపంచ ప్రసిద్ధినొందిన దర్శకులు మీముందుకు రానున్నారు. ఇందుకు ముంబై వేదికకానుంది. అక్టోబర్ 20 నుంచి 27 వరకు రాయల్ ఒపేరా హౌజ్ వేదికగా జరిగే ఈ ఫెస్టివల్లో పలు అవార్డ్ విన్నింగ్ వందలాది చిత్రాలు ఆకట్టుకోనున్నాయి.ఇండియా, చైనా, జర్మనీ, మెక్సికో, కాంబోడియా, ఫ్రాన్స్, బల్గేరియా, ఆస్ట్రియా, సౌదీ అరేబియా, కొలంబియా, ఇజ్రాయిల్, జపాన్, కెనెడా, బ్రెజిల్, పెరు, బెల్జియం వంటి పలు దేశాలకు చెందిన చిత్రాలు ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. పలు డాక్యుమెంటరీలు సైతం ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. ప్రముఖ నటి, దర్శకురాలు కొంకనా సేన్ దర్శకత్వం వహించిన ఎ డెత్ ఇన్ ది గంజ్ చిత్రంతో ఫెస్టివల్ ప్రారంభమవుతుండడం గమనార్హం. ది సినిమా ట్రావెలర్ (ఇండియా), ది సలేస్మెన్ (ఇరాన్), ది రెడ్ టర్టెల్ (ఫ్రాన్స్), ఏ డెత్ ఇన్ ది గంజ్ (ఇండియా), స్విస్ ఆర్మీ మ్యాన్ (అమెరికా), బరాఖ్ మీట్స్ బరాఖ్ (సౌదీ అరేబియా), షాండ్స్ట్రోమ్ (ఇజ్రాయిల్), డేనియల్ బ్లాక్ (యూకే), ఆన్ ఇన్‌సిగ్నిఫికెంట్ మ్యాన్ -2 (ఇండియా) వంటి గొప్ప చిత్రాలు మీరూ వీక్షించాలనుకుంటే వెంటనే ముంబై టూర్ ప్లాన్ చేసుకోండి మరి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







