ఇంకొన్ని దేశాల నుంచి హౌస్‌హోల్డ్ కార్మికులు
- October 14, 2016
జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్, మరికొన్ని దేశాల నుంచి హౌస్ హోల్డ్ లేబర్ని ఆహ్వానించేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలిస్తోంది. ఇండియా, శ్రీలంక, వియత్నాం, ఫిలిప్పీన్స్ తదితర దేశాల నుంచి ఇప్పటికే హౌస్ హోల్డ్ కార్మికుల రిక్రూట్మెంట్కి అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. రానున్న రోజుల్లో హాంగ్ కాంగ్, మలేసియా వంటి దేశాల నుంచి కార్మికుల్ని రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నాలు జాగుతున్నాయి. రిక్రూట్మెంట్ ఆఫీసెస్ కమిటీ ఛైర్మన్ యాహ్యా అల్ మక్బూల్ ఈ విషయమై మాట్లాడుతూ, కో-ఆర్డినేషన్ కమిటీలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. డిమాండ్‌కి తగ్గ విధంగా హౌస్ హోల్డ్ రంగంలో కార్మికుల్ని నియమించే దిశగా ఈ చర్చలు జరుగుతున్నట్లు ఆయన వివరించారు. చాలా కార్యాలయాలు హౌస్ హోల్డ్ కార్మికుల్ని ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్ నుంచే రిక్రూట్ చేసుకుంటున్నట్లు తెలిపారాయన. ఇండోనేషియా, థాయిలాండ్, ఇథియోపియా దేశాల నుంచి కార్మికుల్ని రప్పించేందుకు ప్రతిపాదనలు వస్తున్నాయని, వాటిపై ఆలోచనలు చేస్తున్నామన్నారాయన.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







