ఇస్లామిక్ స్టేట్ ఆత్మాహుతి దాడిలో 55 మంది మృతి
- October 15, 2016
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థకు చెందిన ఓ సూసైడ్ బాంబర్ ఆత్మాహుతి దాడిలో 55 మంది మృతిచెందారు. ఈ ఘటన ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇరాక్ పోలీసుల కథనం ప్రకారం.. నార్త్ బాగ్దాద్ ఏరియాలో మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియల నిమిత్తం వందలాది మంది వచ్చారు. సరిగ్గా మధ్యాహ్నం సమయంలో ఆ ప్రాంతంలో ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దీంతో మొత్తం 31 మంది మృత్యువాత పడగా, మరో 65 మందికి పైగా గాయాలపాలైనట్లు తెలిపారు.
గాయపడ్డవారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, అయితే బాధితులు ఈ ఘటనపై నోరు విప్పే పరిస్థితిలో లేరని అధికారులు చెప్పారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
నార్త్ బాగ్దాద్, మోసుల్ పట్టణంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై ఇరాక్ భద్రతా బలగాలు దాడులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగిందని ఓ సిబ్బంది స్థానిక మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







