భారత్- అమెరికా మిత్ర దేశాలంటున్న ట్రంప్
- October 16, 2016
భారతదేశానికి, హిందువులకు తాను వీరాభిమానినని అంటున్నారు అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్. అమెరికా న్యూజెర్సీలోని రిపబ్లికన్ హిందూ విభాగం నిర్వహించిన ఛారిటీ ఈవెంట్లో ట్రంప్ భారతదేశాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. తానుగానీ అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్-అమెరికాలు మంచి స్నేహితులు అవుతాయి అన్నారు.
ఇరు దేశాల మధ్య మంచి స్నేహాభావమే కాకుండా మెరుగైన సత్సంబంధాలు ఉంటాయని ఇరు దేశాల మధ్య ఆర్ధిక సంస్కరణలపైశ్రద్ధ వహిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీని అభినందించారు.
అధ్యక్ష ఎన్నికల సమయంలో ఓ అధ్యక్ష అభ్యర్ధి ఇండియన్ అమెరికన్ ఈవెంట్‌కి హాజరుకావడం ఇదే తొలిసారని ప్రవాస భారతీయులు తెలిపారు.
తాను హిందువులకు, భారతదేశానికి పెద్ద అభిమానినని అధ్యక్షుడిగాఎన్నికైతే భారత, హిందూ కమ్యూనిటీకి వైట్‌హౌస్‌తో మెరుగైన సత్సంబంధాలు ఉంటాయని, మోదీపై చాలా విశ్వాసముందన్నారు. 19 నెలల క్రితం ఓసారి భారత్ వెళ్లానని మళ్లీ మళ్లీ రావాలని ఉందని తన ప్రసంగంలో ట్రంప్ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని మట్టుబెట్టేందుకు భారత్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







