సిరియా వైమానిక దాడుల్లో 31 మంది మృతి
- October 16, 2016
సిరియాలో తిరుగుబాటుదారుల స్థావరాలపై వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. అలెప్పోలో తిరుగుబాటుదారులు అధికంగా ఉన్న జిల్లాల్లో ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో 31 మంది మృతి చెందినట్టు బ్రిటన్ కు చెందిన మానవ హక్కుల పర్యవేక్షక సంస్థ వెల్లడించింది. తూర్పు అలెప్పోలోని ఖ్వాటెర్జీ, సుక్కరీ, బాబ్ ఆల్-నాజర్ ప్రాంతాలపై నాలుగు వైమానిక దాడులు జరిగినట్టు తెలిపింది. శిథిలాల్లో 10 కుటుంబాలు చిక్కుపోయాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వెల్లడించింది. ఈ దాడుల వెనుక సిరియా ప్రభుత్వ దళాల హస్తం ఉండొచ్చ అనుమానాన్ని వ్యక్తం చేసింది.ప్రభుత్వానికి, తిరుగుబాటు దారులకు మధ్య జరుగుతున్న పోరుతో సిరియా అట్టుడుకుతోంది.ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాలు సిరియాకు సహాయాన్ని నిలిపివేశాయి. రష్యా సహకారంతో తిరుగుబాటుదారులను అణచివేసేందుకు సిరియా ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంతో రోజూ ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







