'లక్ష్మీబాంబ్' చిత్రంలో జడ్జిగా మంచు లక్ష్మి..
- October 16, 2016
'లక్ష్మీబాంబ్ చిత్రంలో జడ్జిగా విభిన్నమైన పాత్రలో కనపడతాను. ఆసక్తికరమైన కథతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నేను పోషిస్తున్న పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా, ఛాలెంజింగ్‌గా ఉంటుంది' అని మంచు లక్ష్మి అన్నారు. ఆమె టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'ఫ్రమ్ శివకాశి' అన్నది ఉపశీర్షిక. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడు. గునపాటి సురేష్‌రెడ్డి సమర్పణలో ఉద్బవ్ ప్రొడక్షన్స్ పతాకంపై వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ సందర్భంగా ప్రధాన పాత్రధారి మంచు లక్ష్మి మాట్లాడుతూ, 'ఏకధాటిగా జరిపిన సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పార్ట్ పూర్తయింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్‌ను తమ్ముడు మనోజ్ ఆధ్వర్యంలో చేశాం. దర్శకుడు ప్రతీ ఫ్రేమును చాలాబాగా తెరకెక్కించారు. మిగిలిన అన్ని కార్యక్రమాలను త్వరగా పూర్తిచేసి, దీపావళికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తాం' అని అన్నారు. చిత్ర సమర్పకుడు సురేష్‌రెడ్డి మాట్లాడుతూ, 'పవర్‌ఫుల్ సబ్జెక్టుతో చక్కటి భావోద్వేగాలతో ఈ సినిమాను రూపొందించాం. అనుకున్న ప్లానింగ్‌లో సినిమా పూర్తయింది. మంచు లక్ష్మిని చాలా కొత్తరకంగా చూపించే సినిమా ఇది. ఫైట్స్, పాటలు ఆకర్షణీయంగా ఉంటాయి. సునీల్ కశ్యప్ అందించిన పాటలకు మంచి స్పందన లభించింది' అని చెప్పారు.దర్శకుడు గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో భాగంగా గ్రాఫిక్స్‌తో పాటు రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. మంచు లక్ష్మి సహకారంతో సినిమాను అనుకున్న సమయంలో పూర్తిచేయగలిగాం. నిర్మాతలు కూడా ఎక్కడా రాజీపడలేదు. పాటలకు మంచి స్పందన రావడం ఆనందదాయకం' అని అన్నారు.
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో పోసాని, హేమ, ప్రభాకర్, హేమంత్, రాకేష్, అమిత్, జీవా, రాజబాబు, శరత్, రాజారవీంద్ర తారాగణం. ఈ చిత్రానికి కథ, మాటలు: 'డార్లింగ్'స్వామి, సంగీతం: సునీల్‌కశ్యప్, ఛాయాగ్రహణం: జోషి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!







