' అసమర్థ ' సాహిర్ కెమెరాలు రోడ్ల నియంత్రణకు సరిపోదు
- October 17, 2016
రియాద్ - ట్రాఫిక్ చట్టంలో సవరణల గూర్చి ఇటీవల మంత్రి మండలి ఆమోదంపై ప్రజల నుంచి మిశ్రమ స్పందనలు వెల్లువెత్తుతున్నాయి .కొంతమంది ఈ చట్టం గూర్చిమాట్లాడుతూ, కొత్త చట్టం చాలా కఠినమైనదని మరియు చాలా క్రూరమైన జరిమానాలు వంటి శిక్షలు కలిగినదని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇతరులు కొందరు దీనిని సమర్ధించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే డ్రైవర్లు, ముఖ్యంగా దేశదిమ్మరులకు ఇందులో తీవ్రమైన శిక్షలు అమలుజరగనున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ట్రాఫిక్ వ్యవస్థపై నిపుణులైన ఒక న్యాయవాది మాట్లాడుతూ, ఈ సవరణల కారణంగా పౌరుడు మరియు అతని హక్కుల ప్రయోజనార్థం సంబంధించినవాని అన్నారు. అయితే వాహనదారుని వేగం నమోదు చేసే "అసమర్థ కెమెరాలను ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసి అవి అత్యంత ఆధునికమైనవని వర్ణించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. రోడ్డు పరిస్థితులను బట్టి వేగ పరిమితులు సర్దుబాటు కాబడతాయని నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి నిబంధనలు ఉల్లంఘించినవారిపై కేసులు ఆధునిక నిఘా కెమెరాలతో మాత్రమే కేసులు నమోదు చేయాలనీ ఆయన పిలుపునిచ్చారు. చట్ట ఉల్లంఘనల గూర్చి న్యాయవాది విమర్శించారు. ప్రతి రకమైన ఉల్లంఘన కోసం ప్రత్యేక జరిమానాలు ఉన్నాయి..అయితే నేర తీవ్రత ఆధారంగా జరిమానాలు మాత్రమే రెట్టింపు చేసే సవరణలపై పునరాలోచించాలని ఆయన విమర్శించారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







