పీరియాడి కల్ కథతో రానా..
- October 17, 2016
బాహుబలి తో బిజీగా ఉన్న రానా.ఈ సినిమా పూర్తయ్యాక తన కెరీర్ ఎలా ఉండాలో ప్లాన్ చేసుకుంటున్నాడు. పదే పదే బాహుబలి లాంటి సినిమాలు దక్కవని ఈ నటుడికి తెలుసు. ఆరేళ్లుగా ఒకే సినిమాలో ఉండిపోయిన రానా .త్వరగా ఈ సినిమా నుంచి బయటకు వచ్చి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న బాహుబలి రెండో భాగం ప్రేక్షకుల ముందుకు రానుండగా..చిత్రీ కరణ మాత్రం మరో రెండు నెలల్లో పూర్తవుతుంది.ఈలో పు దొరికిన సమయాన్ని తన కొత్త చిత్రాల ప్రీ ప్రొడక్షన్ పనులకు ఉపయోగిస్తున్నాడు రానా. ఒక్కో ప్రాజెక్టును ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే తేజ దర్శకత్వంలో ఓ సినిమాకు అంగీకారం తెలపగా. ప్రస్తుతం పీరియాడి కల్ కథతో మరో చిత్రానికి ఓకే చెప్పాడట.సమాచారం ప్రకారం ఇది స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథ. ఇందులో రానా ఓ సైనికుడిగా కనిపించనున్నారు. తమిళ, తెలుగు భాషల్లో సినిమా తెరకెక్కనుంది. రెజీనా నాయికగా నటించనుంది.మిగతా వివరాలను త్వరలో నిర్మాతలు వెల్లడించనున్నారు. ఇటీవల క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన 'కంచె' ఇలాగే చారిత్రక నేపథ్యంతో తెరకెక్కింది. మళ్లి రానా అలాంటి ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







