కొత్త ఆఫర్ ప్రకటించిన ఎయిర్ టెల్
- October 19, 2016
టెలికాం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ బుధవారం మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కంటే చౌక ధరలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా రూ.259 రీచార్జ్ పై 10జీబీ 4జీ డేటా ఆఫర్ చేస్తోంది. వినియోగదారులు కొత్తగా కొనుగోలు చేసిన ఏ 4 జీ స్మార్ట్ ఫోన్ కైనా ఈ ఆఫర్ ను అందించనుంది. ఈ ఇన్విటేషనల్ ఆఫర్ ద్వారా దేశమంతా తాము అమలు చేస్తున్న4జీ నెట్ వర్క్ ను యూజర్లకు అందుబాటులోకి వచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎయిర్ టెల్ బిజినెస్ డైరెక్టర్ అజయ్ పూరి తెలిపారు. ఒక జిబి డేటా తక్షణమే వినియోగదారుని ఖాతాలో జమ చేయబడుతుందనీ, మిగిలిన 9 జీబీ డేటా మై ఎయిర్ టెల్ ఆప్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చని ఎయిర్ టెల్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది.
4 జీ అందుబాటులో లేనిచోట 3జీ డాటా వాడుకోవచ్చని తెలిపింది. గరిష్టంగా 90 రోజుల్లో మూడుసార్లు రీచార్జ్ చేసుకునేందుకు ఈ తాజా ఆఫర్ అనుమతినిస్తుంది. ఇటీవల గుజరాత్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గడ్ లో ప్రారంభించిన ఈ ఆఫర్ ను ఇపుడు దేశమంతా వర్తింపచేస్తోంది. కాగా ఆగస్ట్ లో రూ.250 రీచార్జ్ తో 10 జీబీ 4 జీ డాటాను కేవలం శాంసంగ్ గెలాక్సీ జె సీరిస్ స్మార్ట్ ఫోన్లకు మాత్రమే ఆఫర్ చేసింది. తాజా ఆఫర్ ప్రకారం 4 జీ స్మార్ట్ ఫోన్లు అన్నింటికీ ఈ డాటా సేవలు వర్తింప చేస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







