జిమ్ కి వెళ్ళే వారికి సూచనలు....
- October 19, 2016
మొట్టమొదటి సారిగా వ్యాయామశాలలోకి అడుగు పెట్టేపుడు మనలోని ప్రతి ఒక్కరు చాలా ఆత్రుతకు లోనవుతారు. శారీరక దారుడ్యం పొందుటకు శిక్షణలో చేరేపుడు, వ్యాయామశాలకు వెళుతున్నామనే ఆలోచనతోనే మనం దిగులుకు లోనవుతాం ఎందుకంటే అక్కడ ఏవిధంగా ప్రవర్తించాలనే విషయంపై ఏ ఒక్కరూ ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండరు. ఆ విషయాల గురించి మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే, అన్ని రకాల ఆందోళనల నుండి విముక్తి పొందవచ్చు కాబట్టి అధిక ప్రయాస పడకుండా వ్యాయామశాలలో తరచుగా మనల్ని ఇబ్బందికి గురిచేసే కొన్ని పొరపాట్ల గురించి తెలుసుకుందాం.
తెలుగులో జిమ్ తప్పులు
బిగుతైన దుస్తులు ధరించడం
తరుచుగా మనం ధరించిన దుస్తులు అనగా లోతు మెడ కల T- షర్ట్ లేదా బిగుతైన ప్యాంటు వంటివి మనకు ఇబ్బందికర అనుభూతిని కలిగేలా చేయవచ్చు. క్రిందికి వంగుతుండగా ప్యాంటు చిరిగిపోయిన భయంకర శబ్దాన్ని ఇతరులకు వినిపించాలని మనం ఎవరం కోరుకోము. మనం అతి జాగ్రత్తతో ఎన్ని పనులు చేసినప్పటికీ సరైన దుస్తులు ధరించనట్లయితే అవి అన్నీ వ్యర్ధమే కావున బిగుతైన దుస్తులను ఎపుడూ ధరించకూడదు.
వార్మ్అప్ కి తగినంత సమయం కేటాయించడం లేదా?
అతి ముఖ్యంగా వార్మ్అప్ చేయకుండా వ్యాయమం ప్రారంభించినట్లయితే తక్కువ సమయంలోనే గుండె వేగం పెరిగి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఎదుర్కోవల్సి వస్తుంది, శక్తిని కోల్పోయి మరియు అనాయాసంగా వ్యాయామ సాధనను పూర్తి చేసుకోవాల్సివస్తుంది. వార్మ్అప్ వ్యాయామాలను సక్రమంగా చేయనట్లయితే ఎముకలు మరియు కండరాలు దెబ్బతినే ప్రమాదం కలదు. ఇది మీరు మరింత క్లిష్టమైన వ్యాయామాల సాధనను ప్రారంభించడానికి ముందు చేయవలసిన మొదటి అంకం.
పరికరాలను ఉపయోగించే విధానంను ఊహించడం
మీరు ఇపుడే ఒక పూర్తి కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు కాబట్టి, మీరు యంత్రాలు లేదా వ్యాయామాలను ఎలా ఉపయోగించాలనే విషయాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండరు. మీరు లింగ సమస్యలు లేదా వయసులో వ్యత్యాసం వంటి కారణాల చేత ఎవరినుండైన సహాయం కోరడానికి తిరస్కరించినట్లయితే, అపుడు అసలు సమస్య మొదలవుతుంది, కావున సంశయాలన్నిటిని ప్రక్కకు వదిలి వేయాలి లేదా ఇంకా మెరుగైన అంశం ఏంటంటే శిక్షకుడు అందుబాటులోనే ఉన్నట్లయితే, అతని సహాయంను తప్పక తీసుకోవాలి.
కండరాలను & ఎముకలను అతిశ్రమకు గురి చేయకూడదు
ఇది అతి తక్కువ సమయంలో అతి ఎక్కువగా చేయడం వంటిది. మీరు ఇపుడే అడుగిడుతున్న వ్యాయమ ప్రారంభకులని తప్పక గుర్తుంచుకోవాలి మరియు మీ కండరాలను మరియు ఎముకలను అతిగా శ్రమకు గురి చేయడం వలన ఎలాంటి ప్రయోజనాలను పొందలేము. కార్డియో వ్యాయమాలను ఎక్కువగా చేయడం వలన బరువును ఎక్కువగా తగ్గించుకోలేని స్థితి ఏర్పడుతుంది. ప్రతి ప్రారంభకుడు పూర్తి శరీర వ్యాయామలలో ఈ వ్యాయామాన్ని వదిలిపెట్టకుండా సాధన చేస్తూ మొదలు పెట్టాలి మరియు పెద్ద కండర సమూహాల కోసం గరిష్టంగా 5 సెట్లను ఉపయోగించాలి. విశ్రాంతి సమయం ఎప్పుడూ 90 సెకన్లు మించి ఉండకూడదు. పరిమాణం కంటే నాణ్యతను ఎక్కువగా నమ్మాలి. ఏది ఏమైనప్పటికీ ప్రతి ఆట నాణ్యతను కలిగి ఉండాలి.
సరైన పాదరక్షలు ధరించకపోవడం
ఒక సరైన శరీర రూపం పొందుటకు వ్యాయామం చేస్తున్నప్పుడు మనం ధరించిన పాదరక్షలు ఒక ప్రధాన పాత్రను పోషిస్తాయి. మార్కెట్లో రన్నింగ్ బూట్లు, లిఫ్టింగ్ బూట్లు, కన్వెర్స్ బూట్లు వంటి అనేక రకాల పాదరక్షలు అందుబాటులో ఉన్నాయి. మీకు ఏ రకమైన పాదరక్షాలు ఉత్తమమైనవో శిక్షకుడిని సంప్రదించి తెలుసుకోండి మరియు అలాంటి వాటినే తీసుకోండి. సరైన పాదరక్షలు ధరించనట్లయితే అవి మీ పాదాలకు హాని లేదా గాయాలను కలిగించవచ్చు.
బ్యాంగ్! ఒకసారి మీరు అన్ని వ్యాయామాలు మరియు పరికరాలు మరియు వాటి నిర్వహణను గురించి తెలుసుకున్నట్లయితే, ఖచ్చితంగా మీ బరువును కోరుకున్నంతగా తగ్గించుకోవచ్చు! మీరు వ్యాయామశాలలో ఉన్నప్పుడు ఈ పొరపాట్లను చేయకూడదని గుర్తుంచుకోవాలి మరియు తద్వారా మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో మరియు ఆరోగ్యంతో బయటకురావచ్చు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









