రాబోయే 15 ఏళ్ళలో మెగాసిటీగా తీర్చిదిద్దేందుకు ప్లాన్...
- October 20, 2016
రాజధానికి వచ్చే మూడేళ్ల అంచనాలు ఎలా ఉన్నాయి? అమరావతిలో ఎలాంటి సదుపాయాలు ఉండబోతున్నాయి? ఈ సదుపాయాలకు ఎంత ఖర్చవుతుంది? రుణాలను ప్రభుత్వ ఎలా సేకరించబోతోంది?అంతర్జాతీయ మేటి నగరాల్లో ఒకటిగా నిలిచేలా అమరావతి నిర్మాణాన్ని ఏపీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. అందుకు తగ్గట్లుగానే మౌలిక వసతులపై దృష్టిపెట్టింది. వచ్చే మూడేళ్లలో అంచనాలపై మెకన్సీ కంపెనీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఓ క్లారిటీకి వచ్చింది. ఈ రిపోర్టును బట్టి వచ్చే పదేళ్లలో సుమారు 43 వేల కోట్లు ఖర్చు అవుతుందని లెక్క తేల్చింది. దీంట్లో ఎక్కువగా వచ్చే మూడేళ్లలో 32వేల 463 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ భవనాల నిర్మాణం, ఇతర సదుపాయాలు, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ప్లాట్లలో మౌలిక వసతుల కల్పన బాధ్యత ప్రభుత్వపైనే ఉంది. ఇక్కడ భూములిచ్చిన రైతుల ప్లాట్లలో వసతులకు 10వేల815 కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉంటుందని లెక్క తేలింది. సీడ్ కేపిటల్ ప్రాంతంలో నిర్మించే ప్రభుత్వ భవనాలు, ఉద్యోగుల క్వార్టర్స్‌కు 5వేల 600 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మంచినీరు, మురుగునీటి పారుదల వ్యవస్థకు 750 కోట్లు ఖర్చవుతుందని లెక్క తేలింది. రాజధాని 29 గ్రామాల్లో విద్యుత్ లైన్ల మార్పు, కొత్త లైన్ల నిర్మాణం కోసం 5వేల 287 కోట్లు...1600 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి 4వేల 967 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా. ఇక వరద నివారణ చర్యల కోసం వెయ్యి కోట్లు అవుతుందని లెక్క తేలింది. భూములిచ్చిన రైతులకు పేమెంట్స్‌కు 655 కోట్లు, పచ్చదనం పెంపొందించేందుకు 250 కోట్లు అంచనా వేశారు. ఇక జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రులు, స్టార్ హోటళ్ళ ఏర్పాటు చేసి... రాబోయే 15 ఏళ్ళలో మెగాసిటీగా తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తం నిధుల సమీకరణ కొంచెం కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు 6వేల500 కోట్లు, హడ్కో 7వేల178 కోట్లు రుణం ఇవ్వడానికి అంగీకరించాయి. కేంద్రం 2వేల 500 కోట్లు, ఏపీ బడ్జెట్ లో 4వేల 400 కోట్లు కేటాయించారు. మిగిలిన నిధుల్ని సీఆర్డీఏ పరిధిలోని 4వేల ఎకరాల భూమిని తాకట్లు పెట్టడం ద్వారా అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







