స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు
- October 21, 2016
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో గత మూడు రోజులుగా పెరుగుతూ పోయిన బంగారం ధర నేడు కాస్త దిగొచ్చింది. నగల వ్యాపారుల నుంచి ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో పుత్తడి తగ్గుముఖం పట్టింది. రూ. 140 తగ్గడంతో బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ. 30,400గా ఉంది. ఇక వెండి కూడా నేడు బంగారం దారిలోనే పయనించింది. రూ. 400 తగ్గడంతో కేజీ వెండి ధర రూ. 42,300కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో ధరలు తగ్గినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







