వాట్సాప్‌లో మరో చక్కని ఫీచర్..
- October 22, 2016
మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ మరో చక్కని ఫీచర్‌ను తన యూజర్లకు అందించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే వాట్సాప్‌లో వీడియో కాల్స్ కూడా చేయవచ్చు. ఇప్పటివరకు వాయిస్ కాల్ సదుపాయాన్ని అందిస్తూ వచ్చిన వాట్సాప్ ఇకపై వీడియోకాల్స్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్ పరీక్షిస్తోంది. 'బేటా' మోడ్‌కు సంబంధించి విండోస్ ఫోన్, ఐఫోన్‌లలో ఇప్పటికే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ వీడియో కాల్స్ ఆప్షన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.పరీక్షల నిమిత్తం విండోస్ మొబైల్ యూజర్లకు వీడియో కాల్ ఆప్షన్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని ఇప్పటికే స్పానిష్ వెబ్‌సైట్ ఒకటి వెల్లడించిన సంగతి తెలిసిందే.ఈ యూజర్ల వాట్సాప్‌లో వాయిస్ కాల్ ఆప్షన్‌తోపాటు దాని పక్కన వీడియోకాల్ ఆప్షన్ కూడా ఉంది. వాట్సాప్‌లో ఇప్పటివరకు కాల్స్ మాత్రమే చేసుకున్న యూజర్లు.. వీడియో కాల్ అందుబాటులోకి వస్తే ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాతోపాటు, బ్యాక్ కెమెరాతో కూడా ఈ ఫీచర్‌ను వాడుకునే అవకాశం కల్పించారు. అంతేకాకుండా అవసరం లేకుంటే మ్యూట్ చేసుకొనే సదుపాయం, మిస్డ్‌కాల్ వస్తే తెలియజేసే సౌకర్యం కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. వాట్సాప్ గత ఫీచర్ల మాదిరిగానే ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చుకోవడానికి యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే గూగుల్ కంపెనీ వీడియో కాల్స్ కోసం డ్యువో ఆప్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు స్నాప్‌చాట్ వంటి యాప్‌లు కూడా పోటీని ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ మరిన్ని మెరుగైన ఫీచర్లతో తన యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







