అబుధాబి లో సభ్యత్వ నమోదు నిర్వహించిన 'APNRT' టీం

- October 22, 2016 , by Maagulf

అబుధాబిలో ఎన్.పి.సి.సి క్యాంపు లో APNRT కో-ఆర్డినేటర్స్,యుఏఈ ఆధ్వర్యం లో సభ్యత్వం ఘనంగా నిర్వహించారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న APNRT సభ్యత్వం నమోదు కార్యక్రమం లో దాదాపు 1500 మంది తెలుగు వారు పాల్గొన్నారు.ముందుగా శ్రీకాంత్ చిత్తర్వు కో-ఆర్డినేటర్స్ ను పరిచయం చేసారు.ప్రభుత్వం APNRT ద్వారా తెలుగు NRI ప్రజలకు ఏవిధమైన సహాయ సహకార్యాలు అందిస్తారని ఈ సమావేశం లో తెలుగు వారికి ఒబ్బిలిశెట్టి అనురాధ వివరించారు.ఉద్యోగులు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.ప్రభుత్వం విదేశాలలో ఉన్న తెలుగు వారికోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని దీనిని విదేశాలలో ఉన్న ప్రతి ఒక్కరు  ఉపయోహించుకోవాలని కోరారు.చివరిగా డాక్టర్ ముక్కు తులసి కుమార్ వోట్ ఆఫ్ థాంక్స్ తో ముగించారు.

ఈ కార్యక్రమములో యుఏఈ కో-ఆర్డినేటర్స్ ఒబ్బిలిశెట్టి అనురాధ, శ్రీకాంత్ చిత్తర్వు, డాక్టర్ ముక్కు తులసి కుమార్ మరియు ఆంధ్ర ప్రదేశ్ కు సంభందించిన దాదాపు 1500 మంది ఈ సభ్యత్వం నమోదు లో పాల్గొన్నారు.క్యాంపు ఇంచార్జి నమాల శ్రీనివాసరావు కు కో-ఆర్డినేటర్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com