'మొట్టశివ కెట్టశివ' లో లారెన్స్‌...

- October 22, 2016 , by Maagulf
'మొట్టశివ కెట్టశివ' లో  లారెన్స్‌...

 'కాంచన' వరుస సినిమాలతో ప్రేక్షకులను బెంబేలెత్తించి వినోదాన్ని పంచిన రాఘవ లారెన్స్‌... ఆ ట్రెండ్‌ నుంచి బయటపడి ప్రస్తుతం పోలీసు అధికారిగా ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'మొట్టశివ కెట్టశివ' అని పేరు పెట్టారు. ఇందులో లారెన్స్‌కు జంటగా నిక్కీ గల్రాణి హీరోయిన్‌గా నటిస్తోంది. సత్యరాజ్‌ కూడా పోలీసు అధికారిగా నటిస్తున్నారు. సాయి రమణి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన 'పటాస్‌' చిత్రానికి రీమేక్‌ ఇది. సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తోంది. అమ్రీష్‌ సంగీతం సమకూరుస్తున్నారు. చిత్రీకరణ చివరిదశకు చేరుకుందని తెలుస్తోంది.డిసెంబరు 23న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. లారెన్స్‌కు యాక్షన్‌ హీరో ఇమేజ్‌ను ఇస్తుందని చిత్రవర్గాలు భావిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com