'మొట్టశివ కెట్టశివ' లో లారెన్స్...
- October 22, 2016
'కాంచన' వరుస సినిమాలతో ప్రేక్షకులను బెంబేలెత్తించి వినోదాన్ని పంచిన రాఘవ లారెన్స్... ఆ ట్రెండ్ నుంచి బయటపడి ప్రస్తుతం పోలీసు అధికారిగా ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'మొట్టశివ కెట్టశివ' అని పేరు పెట్టారు. ఇందులో లారెన్స్‌కు జంటగా నిక్కీ గల్రాణి హీరోయిన్గా నటిస్తోంది. సత్యరాజ్ కూడా పోలీసు అధికారిగా నటిస్తున్నారు. సాయి రమణి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన 'పటాస్' చిత్రానికి రీమేక్ ఇది. సూపర్‌గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. అమ్రీష్ సంగీతం సమకూరుస్తున్నారు. చిత్రీకరణ చివరిదశకు చేరుకుందని తెలుస్తోంది.డిసెంబరు 23న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. లారెన్స్‌కు యాక్షన్ హీరో ఇమేజ్ను ఇస్తుందని చిత్రవర్గాలు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







