డ్రగ్స్ కేసులో అరస్టైన అసెస్టెంట్ డైరక్టర్....

- October 22, 2016 , by Maagulf
డ్రగ్స్ కేసులో అరస్టైన  అసెస్టెంట్ డైరక్టర్....

గతంలో చాలా సార్లు డ్రగ్స్ కేసులో సినిమావాళ్ళు ఇరుక్కోవటం చూసాం. ఇప్పుడు మరోసారి ఒక డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. జీడిమెట్ల పోలీసులు ఇద్దరిని అరెస్టుచేసి, వారి నుంచి కిలో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఒక సినీనిర్మాత, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉండటమే హాట్ టాపిక్ గా మారింది.
నెల్లూరుకు చెందిన వెంకట సురేష్ అనే వ్యక్తి, యూసుఫ్‌గూడకు చెందిన కిషోర్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ కలిసి విద్యార్థులకు డ్రగ్స్ అమ్మడానికి ప్రయత్నించారు. ఇతడు ఇంతకుముందు రాంగోపాల్ వర్మ సినిమాకి పని చేసినట్లు తెలిసింది.
నిందితులు ఇచ్చిన సమాచారంతో నెల్లూరు జిల్లాలో మరోవ్యక్తిని అరెస్టుచేసి, అతడి వద్ద నుంచి కిలోన్నర కిటామైన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం డ్రగ్స్ విలువ రూ. 6 కోట్లని అంచనా వేశారు. కొకైన్ గ్రాము 5-10 వేల వరకు అమ్ముడవుతుంది. సైబరాబాద్ పరిధిలో ఇది రెండో అతిపెద్ద డ్రగ్స్ కేసు.

ఇంతకుముందు ఒక సైంటిస్ట్ ని అరెస్టుచేసి, అతడి వద్ద వందల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com