జైషే ఉగ్రవాదులు.. సఫీర్ అహ్మద్ భట్, ఫర్హాన్ ఫయాజ్ను అరెస్ట్..
- October 22, 2016
భారీ ఉగ్ర కుట్రను భారత నిఘా సంస్థ లు ఛేదించాయి. జమ్మూకశ్మీర్లోని బారాముల్లాలో ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదులను శుక్రవారం అర్థరాత్రి జరిపిన గాలింపు చర్యల్లో అదుపులోకి తీసుకున్నాయి. జైషే ఉగ్రవాదులు.. సఫీర్ అహ్మద్ భట్, ఫర్హాన్ ఫయాజ్ను అరెస్ట్ చేసి వారి నుంచి పెద్ద ఎత్తున ఏకే-47లను, గ్రెనేడ్లను స్వాధీనం చేసుకొన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో బారాముల్లాలో ఇద్దరు జవాన్లను, పోలీసును హతమార్చిన ఘటనలో వీరు నిందితులని అధికారు లు వెల్లడించారు. కాగా, సాంబ సెక్టార్లో బోధ్రాజ్ అనే పాక్ గూఢచారిని అదుపులోకి తీసుకొన్నారు. అతని వద్ద నుంచి పాక్ సిమ్ కార్డులను, భారత సైన్యం మోహరింపునకు సంబంధించిన మ్యాపును స్వాధీనం చేసుకొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







