డ్రగ్స్ కేసులో అరస్టైన అసెస్టెంట్ డైరక్టర్....
- October 22, 2016
గతంలో చాలా సార్లు డ్రగ్స్ కేసులో సినిమావాళ్ళు ఇరుక్కోవటం చూసాం. ఇప్పుడు మరోసారి ఒక డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. జీడిమెట్ల పోలీసులు ఇద్దరిని అరెస్టుచేసి, వారి నుంచి కిలో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఒక సినీనిర్మాత, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉండటమే హాట్ టాపిక్ గా మారింది.
నెల్లూరుకు చెందిన వెంకట సురేష్ అనే వ్యక్తి, యూసుఫ్‌గూడకు చెందిన కిషోర్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ కలిసి విద్యార్థులకు డ్రగ్స్ అమ్మడానికి ప్రయత్నించారు. ఇతడు ఇంతకుముందు రాంగోపాల్ వర్మ సినిమాకి పని చేసినట్లు తెలిసింది.
నిందితులు ఇచ్చిన సమాచారంతో నెల్లూరు జిల్లాలో మరోవ్యక్తిని అరెస్టుచేసి, అతడి వద్ద నుంచి కిలోన్నర కిటామైన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం డ్రగ్స్ విలువ రూ. 6 కోట్లని అంచనా వేశారు. కొకైన్ గ్రాము 5-10 వేల వరకు అమ్ముడవుతుంది. సైబరాబాద్ పరిధిలో ఇది రెండో అతిపెద్ద డ్రగ్స్ కేసు.
ఇంతకుముందు ఒక సైంటిస్ట్ ని అరెస్టుచేసి, అతడి వద్ద వందల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







