ధూమపానంకు దూరంగా 195 మంది...పి హెచ్ సి సి కృతజ్ఞతలు
- October 23, 2016
ప్రస్తుత సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో 604 మంది మొత్తం ప్రాధమిక ఆరోగ్య రక్షణ కార్పొరేషన్ (PHCC) సందర్శించారు. వివిధ ఆరోగ్య కేంద్రాలలో ధూమపానం మానివేసేందుకు నిర్వహించబడుతున్న క్లినిక్స్ లో చేరినవారిలో 195 మంది చేత ధూమపానం యొక్క హానికరమైన మరియు ప్రమాదకరమైన విషయాలను వివరించి వారితో ఈ అలవాటుని విజయవంతంగా మాన్పించడం సంతోషకరమైన సంగతి అని
ఈ చికిత్సాలయంను దర్శించినవారిలో 18 సంవత్సరాల వయసు నుంచి 30 ఏళ్ళ లోపువారు ఉన్నారని అయితే ధూమపానం మానివేసినవారు శాతం మూడింట ఒకరు మాని వేయడం ఒక మంచి విజయం రేటు సాధించిందని ప్రాధమిక ఆరోగ్య రక్షణ కార్పొరేషన్ లో హెల్త్ ప్రమోషన్ అండ్ వెల్నెస్ డైరెక్టర్, డాక్టర్ వాద అల్-బేకర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ధూమపానం వ్యక్తి యొక్క ఆరోగ్యానికి చాలా హానికరం అని..పుండ్లు పెరగడం, ఇతర ప్రాణహాని కలిగించే వ్యాధులకు ధూమపానం ఒక ప్రధాన కారణం. పొగాకు నమలడం కారణంగా నోటిలో పుండ్లు పడటం.. పొగ పీల్చడం ద్వారా కాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ...ఇందులో ఉన్న 45 విష రసాయనాలు మానవ ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. ధూమపానం మానివేయలేకపోతే ముఖ్యంగా మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలి . ఒక డయాబెటిక్ వ్యక్తి ధూమపానం వదలనపుడు రక్తంలో చక్కెర స్థాయిలు అభివృద్ధి, ప్రసరణ, మొదలైనవి కొలెస్ట్రాల్ పడి పోవడం తదితర తక్షణ ప్రభావాలు కనబడతాయి. ధూమపానం చేయడం మానివేసేందుకు ఒకసారి ఈ దిగువన సూచించిన క్లినిక్ లను సందర్శించండి.. దురలవాటు మానివేయాలి అని భావించే వ్యక్తులు వారి పరిస్థితిని మెరుగుపర్చుకొనేందుకు ఓ చక్కని అవకాశం అని పేర్కొన్నారు. ధూమపానంని మానివేయాలి అని నిర్ణయించుకోవాలని భావించే వారి కోసం లేయాబైబు , అల్ ఘరఫా , అబూ బేకర్, మీసైమీర్ , అల్ దాయం మరియు ఒమర్ బిన్ ఖత్తాబ్ ఆరోగ్య కేంద్రాలలో ఈ వైద్యం అందుబాటులో ఉందని డాక్టర్ వాద వెల్లడించారు .
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







