వరుస పేలుళ్లు తో మణిపూర్....
- October 23, 2016
మణిపూర్ రాష్ట్రంలోని ఉక్రుల్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రం ఇబోబీ సింగ్ పర్యటన నేపథ్యంలో ఈ పేలుడు చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది.
గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. ఘటన స్థలం వద్ద భారీగా మోహరించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కాగా, ఆదివారం కూడా ఇదే ప్రాంతంలో ఓ హ్యాండ్ గ్రనేడ్ గుర్తించిన పోలీసులు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పేల్చేశారు.
పాక్ సైన్యం కాల్పుల్లో జవాను మృతి
శ్రీనగర్: దేశ సరిహద్దుల్లో పాక్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది.
జమ్మూకాశ్మీర్లోని ఆర్ఎస్ పురా, పర్గ్వాల్, కనాచక్ ప్రాంతాల్లోని సైనిక శిబిరాలపై పాక్ సైన్యం పలుమార్లు కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







